ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Actress Radha files police complaint over 50 crore fraud

50 కోట్లు మోసం.. న‌టి రాధ పోలీసుల‌కు ఫిర్యాదు

Actress Radha files police complaint over 50 crore fraudActress Radha files police complaint over 50 crore fraud

ప్రముఖ నటి రాధ తన సోదరి, నటి అంబికా నాయర్ .. వారి సోదరుడు మల్లికార్జున కుంజన్ నాయర్‌లపై చెన్నై పోలీసు కమిషనర్ కార్యాల‌యంలో ఫిర్యాదు చేశారు. తన గదిలోకి అనధికారికంగా ప్రవేశించి.. అక్కడ ఉంచిన సంతకం చేసిన ఖాళీ చెక్కులను దొంగిలించి, వాటిని రూ. 50 కోట్లకు ఎన్‌క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించారని రాధ‌ ఆరోపించారు.

సెప్టెంబర్ 17న అంబికా నాయర్ పేరుతో చెక్కులు ప్రెజెంట్ అయినట్లు బ్యాంకు నుండి తనకు ఇమెయిల్ వచ్చిందని రాధ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమై బ్యాంకును సంప్రదించి లావాదేవీలను నిలిపివేయాలని కోరారు. ఆ చెక్కులను తాను ఎవరికీ ఇవ్వలేదని... ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకపోయినా వాటిని అక్రమంగా దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ చెక్కుల‌లో 27 కోట్లు, 13 కోట్లు, 7 కోట్లు అంటూ పెద్ద మొత్తాల‌ను రాయ‌డం బ్యాంకు అధికారుల్లో సందేహాన్ని క‌లిగించింది.

వృత్తిప‌రంగా వ్యాపార లావాదేవీల‌కు ఉప‌యోగించేందుకు బ్లాంక్ చెక్ ల‌పై తాను సంత‌కం చేస్తాన‌ని .. అయితే ఫ‌ర్మ్ పేరు మారిపోయినా పాత చెక్ బుక్ లోని చెక్కుల‌ను వీరంతా దుర్వినియోగం చేయ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని కూడా రాధ పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. త‌న సోద‌రుడు అర్జున్ నాయ‌ర్ ఇప్ప‌టికే ఓ క్రిమిన‌ల్ కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న విష‌యాన్ని కూడా రాధ త‌న రిపోర్ట్ లో రాయ‌డం సంచ‌ల‌నం సృష్టించింది.
 

Radha files sensational complaint against sister