ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kayadu Lohar Missing From The Paradise Promotions

కీర్తి ని అయినా తెచ్చుకోవయ్యా నాని

Kayadu Lohar Missing From The Paradise PromotionsKayadu Lohar Missing From The Paradise Promotions


హీరో నాని సినిమాలో నటించడమే కాదు, ఆ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడతాడు. నిర్మాత కష్టం నాని కష్టంగా భావిస్తాడు. అందుకే సినిమాని ప్రోపర్ గా ప్రమోట్ చేస్తాడు. ఇప్పుడు ప్యారడైజ్ ప్రమోషన్స్ కి అస్సలు సమయం లేకపోయినా ఉన్న కాస్త టైమ్ లోనే సినిమాని చెన్నై, బెంగుళూరు, కొచ్చి లలో ప్రమోట్ చేసి ఈరోజు హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాబోతున్నాడు.

అయితే హీరో నాని సోలో గా ప్రమోషన్స్ లో కనిపిస్తున్నాడు. హీరోయిన్ కాయదు లోహర్ ప్యారడైజ్ ప్రమోషన్స్ లో కనిపించడం లేదు. దానికి చాలా రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాయదు లోహర్ కి ప్యారడైజ్ టీమ్ కి గొడవలంటూ ప్రచారం జరుగుతుంది. సరే కాయదు కూడా రావడం లేదు.

ఈరోజు హైదరాబాద్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ కనిపించకపోతే చాలా డ్రై గా ఉంటుంది. కాయదు లోహర్ గనక ఈ ఈవెంట్ కి కూడా రాకపోతే కనీసం ప్యారడైజ్ లో స్పెషల్ సాంగ్ ఏష నాగుల సాంగ్ లో డాన్స్ చేసిన కీర్తి సురేష్ ని అయినా తెచ్చుకోవయ్యా నాని అంటూ నాని ఫ్యాన్స్ అడుగుతున్నారు.

మరి ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని సరసన ఏ హీరోయిన్ కనిపిస్తుందో అనేది ఇప్పుడు క్యూరియాసిటీగా మారింది

Why is Kayadu Lohar missing from The Paradise promotions