మైసా టీజర్ : రష్మిక కష్టం స్క్రీన్ పై

Mysaa Teaser releasedMysaa Teaser released


రీసెంట్ గా గాయం నుంచి కోలుకుని మైసా షూటింగ్, అలాగే రణబాలి షూటింగ్ సెట్స్ లోకి వెళ్ళిపోయిన రష్మిక మందన్న తాజాగా మైసా టీజర్ లాంచ్ ఈవెంట్ లో చీర జాకెట్టులో మెస్మరైజ్ చేయడమే కాదు.. టీజర్ లో రష్మిక ఎంతగా కష్టపడిందో అర్ధమవుతుంది. టీజర్ ఈవెంట్ లో రష్మిక మట్లాడుతూ.. ఈ చిత్రం కోసం నా లైఫ్‌నే ఇచ్చేశాను. చాలా హార్డ్ వర్క్ చేసిన సినిమా ఇది. మీకు కచ్చితంగా నచ్చుతుందని నమ్మకం ఉంది.. అంటూ రష్మిక మైసా చిత్రం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

ఈ చిత్రంలో గోండ్ గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న రష్మిక, ఆ పాత్రలో ఒదిగిపొవడానికి చాలా కష్టపడింది అనేది మైసా టీజర్ చూస్తేనే తెలుస్తుంది. అలసిపోయాను.. ఆగిపోయాను.. ఓడిపోయాను అంటూ రష్మిక మైసా టీజర్ లో చెప్పే డైలాగ్‌ హైలెట్ గా నిలుస్తుంది. భయపడని, వెనక్కి తగ్గని గిరిజన మహిళగా ఆమె పాత్ర అద్భుతంగా ఉంది. ప్రతి సమస్యను ఎదురించి పోరాడే ఒంటరి యోధురాలిగా మైసా కనిపిస్తుంది.  

రష్మిక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లలో అదరగొట్టారు. బైక్‌ను ఎంతో ధైర్యంగా నడపడంతో పాటు.. అండర్‌వాటర్ సీక్వెన్స్‌లలోనూ సాహసోపేతమైన స్టంట్స్ చేశారు.. నీటి అడుగున రష్మిక కొడవలిని పట్టుకుని కూర్చున్న షాట్ హాంటింగ్‌గా ఉండటంతో పాటు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. గర్ల్ ఫ్రెండ్ కోసం నా ఎమోషన్ మొత్తం ఇచ్చేశా.. మైసా కోసం నా లైఫ్‌నే ఇచ్చేశా.. అంటూ రష్మిక మైసా టీజర్ లాంచ్ ఈవెంట్ లో రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

నవంబర్ 27, 2026న మైసా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.  

Mysaa Teaser out