జిమ్ లో అల్లాడిస్తున్న అనసూయ
Anasuya Bharadwaj GYM Workout Video viral
40 ప్లస్ లోకి ఎంటర్ అయ్యాక కాస్త బరువుగా కనిపిస్తుంది, బొద్దుగా కనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో అనసూయ పై చాలామంది కామెంట్లు పెట్టారు. ఆమె కున్న హైట్ అడ్వాంటేజ్ వల్లే అనసూయ బరువు కనిపించడం లేదు కానీ చీర కట్టినా, లేదంటే మోడ్రెన్ డ్రెస్ లో అయినా అనసూయ బరువు స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు.
అందుకో, లేదంటే హెల్త్ ప్రోబ్లెంస్ ని కొని తెచ్చుకోవడం ఎందుకు అనుకుందో తెలియదు కానీ.. అనసూయ ఈమధ్యన జిమ్ లో వర్కౌట్స్ తో కుమ్మేస్తుంది. తను జిమ్ లో చేసే వర్కౌట్స్ వీడియోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. బరువు ఎత్తడమే కాదు, యోగ తోనూ అనసూయ అద్దరగొట్టేస్తుంది.
మరి జిమ్ లో వరౌట్స్ ప్రభావమో, లేదంటే డైట్ చేస్తుందో తెలియదు కానీ.. అనసూయ ఇప్పుడు స్లిమ్ గా కనిపిస్తుంది. చీరకడితే ఆరడుగుల అందంతో మెరిసిపోతుంది. అనసూయ జిమ్ వీడియోస్, ఆమె శారీ ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
















































