ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Trivikram Dropped From Hanuman Ansh Telugu Version?

లాస్ట్ మినిట్ లో త్రివిక్రమ్ డ్రాప్?

Trivikram Dropped From Hanuman Ansh Telugu Version?Trivikram Dropped From Hanuman Ansh Telugu Version?

 

హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన హనుమాన్ అంశ్ ని 40 రోజుల తర్వాత తెలుగులో విడుదల చేద్దామని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారు. త్రివిక్రమ్ ప్రొడక్షన్ నుంచి హనుమాన్ అంశ్ రేపు అంటే సెప్టెంబర్ 18 న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ చిత్రం విడుదల కాబోవడం లేదు.

హనుమాన్ అంశ్ కి సెన్సార్ చిక్కులు రావడం, అలాగే డబ్బింగ్ పనులు పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల వాయిదా వేస్తున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ ఈ బ్లాక్ బస్టర్ మూవీ ని తెలుగులో విడుదల చేసే విషయంలో వెనుకంజ వేశారనే టాక్ మొదలయ్యింది.

మరి త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ తెలుగులో వర్కౌట్ అవ్వదని తప్పుకున్నారో, లేదంటే నిజంగా సెన్సార్ చిక్కులు ఉన్నాయో తెలియదు కాని.. హనుమాన్ అంశ్ అయితే రేపు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం లేదు.  

Hanuman Ansh Telugu release faces uncertainty