హిట్ సినిమా ఓటీటీ రిలీజ్ వాయిదా
Bethlehem Kudumba Unit OTT Release Delayed
పెద్దగా అంచనాలు లేకుండా ఆగష్టు 21 న మలయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన నివిన్ పౌలి - మమిత బైజుల బెత్లెహొమ్ కుటుంబ యూనిట్ చిత్రం మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కేవలం రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ తీసుకొచ్చి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇక మలయాళ ఇండస్ట్రీ లెక్క ప్రకారం నాలుగు వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కి రావాల్సి ఉంది. మలయాళంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని రెండు వారాల గ్యాప్ లో తెలుగులో విడుదల చేసారు. తెలుగులో అంతంతమాత్రంగా నిలిచిన ఈ చిత్రం ఇంకా థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ నమోదు చెయ్యడంతో మేకర్స్ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ బెత్లెహొమ్ కుటుంబ యూనిట్ ఓటీటీ రైట్స్ ని ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది. మరి నాలుగు వారాల ఒప్పందంతో రేపు శుక్రవారమే బెత్లెహొమ్ కుటుంబ యూనిట్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు మరో రెండు వారాల తర్వాతే స్ట్రీమింగ్ లోకి తేవాలని మేకర్స్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది.
















































