రమా నందన పై సెన్సేషనల్ ఆరోపణలు
Sensational allegations against Rama Nandana
UK లో ఉంటూ యూట్యూబ్ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అవడమే కాదు.. ఆ ఫేమ్ ని ఎంతోమంది బ్రతుకులు నాశనం చేసేందుకు ఉపయోగించడమే ఇప్పుడు నందూస్ వరల్డ్ నందన ను విచారణ పేరుతొ పోలీసులు మూడు చెరువులు నీళ్లు తాగించేలా చేసింది. ఇండియాలోని అందులోను ఏపీ, తమిళనాడు, తెలంగాణ లో ఫేక్ వీసాలు, విదేశాల్లో ఉద్యోగాల పేరుతొ మోసం చేసిన కేసులో భార్య రమా నందన, భర్త మధుకర్ లపై పలు కేసులు నమోదు అయ్యాయి.
లుకౌట్ నోటీసులు ఉన్నాయని తెలిసినా ఇండియాలో అడుగుపెట్టిన రమా నందన ను ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఇబ్రహీం పట్నం పోలీసులకు అప్పజెప్పారు. ఇక ఇబ్రహీం పట్నం, అలాగే అద్దంకి పోలిసుల విచారణకు హాజరైన రమా నందన ఈ కేసులో తన తప్పేమి లేదు, ఆ కంపెనీలు అన్ని తన భర్త మధుకర్ పేరు మీద ఉన్నాయని తప్పించుకునే ప్రయత్నంలో ఉంది.
ఈలోపే తమిళనాడు కు చెందిన మరో బాధితుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ద్వారా నందన, మధుకర్ ల అసలు గుట్టు బట్టబయలైంది. UK లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి తన దగ్గర నుంచి నందూస్ కిచెన్ కోసం మూడేళ్ల స్పాన్సర్ షిప్ అంటూ భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లుగా తెలపడమే కాదు, రెస్టారెంట్ కు మధుకర్ కోసం వచ్చే వాళ్ళను చూసి నందన తన భర్త మధుకర్ ను బాత్ రూమ్ లో దాచి పెట్టేది.
ఆతర్వాత రెస్టారెంట్ మూసివేశారని, గడిచిన కొన్ని నెలలుగా జీతాలు కూడా ఇవ్వకుండా తీవ్రంగా వేధించారని తమిళనాడుకు చెందిన వ్యక్తి ఆరోపిస్తున్నాడు. మరి ఈ వీడియోస్ పై నందు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
















































