ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vishwambhara release date confusion continues

వినాయకుడు కూడా విఘ్నాలు తొలగించలేదు

Vishwambhara release date confusion continuesVishwambhara release date confusion continues


నిజమే వినాయక చవితికి విగ్నేశ్వరుడికి విశేష పూజలు నిర్వహస్తే విఘ్నాలు తొలిగిపోతాయని పెద్దలు చెబుతారు. అలాగే ఏ పూజకైనా విగ్నేశ్వరుడికి తొలిపూజ సాంప్రదాయం. విఘ్నాలు తొలగించుకోవడానికి విగ్నేశ్వరుడికి పూజలు చేస్తారు. మరి ఈ విగ్నేశ్వరుడు కూడా విశ్వంభర విఘ్నాలు తొలగించలేకపోయారు.

నిన్న వినాయక చవితి సందర్భంగా అయినా విశ్వంభర విడుదల తేదీపై వశిష్ట క్లారిటీ ఇస్తారని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశపడ్డారు. కానీ వశిష్ట మాత్రం విశ్వంభర విడుదల తేదీపై స్పష్టత ఇవ్వకుండా ఇంకా కన్ఫ్యూజన్ లో పెట్టడమే అభిమానుల ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. సంక్రాంతి 2027 విశ్వంభర విడుదల అంటున్నారు.

గత వారం రోజులుగా ఇదే నడుస్తుంది. అదేదో వినాయక చవితి రోజున చెబితే ఫెస్టివల్ సెంటిమెంట్ కలిసొచ్చేది. కానీ వశిష్ట వినాయక చవితిని కూడా లైట్ తీసుకోవడం చూసిన వారు వినాయకుడు కూడా విశ్వంభర విఘ్నాలు తొలగించలేకపోయాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

Vishwambhara