పాత ఫోన్ల ధరలు భారీగా పెంచిన యాపిల్
Apple hikes iPhone prices in Indiaయాపిల్ కొత్త ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.యాపిల్ విడుదల చేసిన తొలి ఫోల్డబుల్ ఫోన్ `ఐఫోన్ డ్యూయో` తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు శామ్‌సంగ్, గూగుల్ రాజ్యమేలుతున్న ఫోల్డబుల్ విభాగంలోకి యాపిల్ ఈ ఫోన్‌తో సరికొత్తగా అడుగుపెట్టింది. లిక్విడ్ గ్లాస్ డిజైన్, గ్రేడ్ 5 టైటానియమ్ బాడీ.. ముందు వెనుక సెరామిక్ షీల్డ్ టెక్నాలజీతో దీనిని రూపొందించారు. ఈ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 7.6 అంగుళాల మెయిన్ ఓఎల్.ఇ.డి డిస్‌ప్లేను.. బయట వైపు 5.4 అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో సరికొత్త ఏ20 ప్రో ప్రాసెసర్ మరియు ఐవోఎస్ 27 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అమర్చారు.
క్యామెరా, బ్యాటరీ పరంగా ఐఫోన్ డ్యూయో వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ఇందులో వెనుకవైపు 48 మెగాపిక్సెల్ మెయిన్ - ఆల్ట్రావైడ్ కెమెరాలు ఉండగా.. కవర్ డిస్‌ప్లేపై 12 ఎంపి కెమెరా .. మెయిన్ స్క్రీన్ లోపల అండర్-డిస్‌ప్లే ఫేస్‌టైమ్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ కవర్ స్క్రీన్‌పై ఏకంగా 44 గంటలు.. మెయిన్ స్క్రీన్‌పై 31 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుందని సంస్థ పేర్కొంది. వీటితో పాటు ఐపి68 డస్ట్ , వాటర్ రెసిస్టెన్స్, సైడ్ టచ్ ఐడీ, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అధునాతన హంగులతో స్టార్ వైట్, నైట్ స్కై రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. దీనితో పాటు ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మాక్స్ మోడళ్లను ఆపిల్ ప్రదర్శించినా ఈ ఏడాది ఎటువంటి స్టాండర్డ్ `ఐఫోన్ 18` మోడల్‌ను పరిచయం చేయకపోవడం గమనార్హం.
మరొకవైపు భారత్‌లో కొత్త ప్రో మోడళ్ల ధరలను రూ. 25,000 నుండి 30,000 వరకు పెంచడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో భారత్‌లో కొత్త ఐఫోన్ కొనాలంటే రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షలు పెట్టాల్సిందే అన్న పరిస్థితి ఏర్పడింది. ఐఫోన్ డ్యూయో ధర అమెరికాలో 1,999 డాలర్లు కాగా.. భారతదేశంలో ఏకంగా రూ.2,99,900 గా నిర్ణయించారు. ఈ భారీ ధర వల్ల ఐఫోన్ డ్యూయో పెద్ద ఎత్తున సేల్స్ సాధించకపోయినా బ్రాండ్ ఇమేజ్‌ను.. ప్రీమియం హోదాను పెంచడానికి ఒక ఆస్పిరేషనల్ ప్రొడక్ట్‌గా ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సరికొత్త ఐఫోన్ 18 సిరీస్ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆపిల్ సంస్థ భారత మార్కెట్‌లో తన పాత మోడళ్ల ధరలను భారీగా సవరించింది. ఈ కొత్త ధరల పెంపుతో రకరకాల మోడళ్ల రేట్లు రూ.10,000 నుండి ఏకంగా రూ.30,000 వరకు ఎగబాకాయి. పెరిగిన ధరల ప్రకారం.. ఐఫోన్ 17ఇ బేస్ వేరియంట్ ధర 64,900 నుండి 79,900కు పెరగ్గా.. ఐఫోన్ 16 రేటు 79,900 నుండి 89,900కు చేరింది. అలాగే ఐఫోన్ 17 ధర 82,900 నుండి 99,900కు చేరగా.. ఐఫోన్ ఎయిర్ మోడల్ ధర అత్యధికంగా 1,19,900 నుండి ఏకంగా 1,49,900కు పెరిగి ధరలు మరింత ప్రియంగా మారాయి.







































