ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> OTT Deals Put Pressure On Fauzi and Dada

ఫౌజీ, దాదా : ఓటీటీ కండిషన్స్ అప్లై

OTT Deals Put Pressure On Fauzi and DadaOTT Deals Put Pressure On Fauzi and Dada


ఓటీటీ లు ఇప్పుడు నిర్మాతలపై పెత్తనం చెలాయిస్తున్నాయి. ఒకప్పుడు నిర్మాతలు ఎంత చెబితే అంత అన్నట్టుగా ఓటీటీ లు కనిపించేవి. కానీ ఇప్పుడు ఓటీటీ కండిషన్స్ కి ప్రొడ్యూసర్స్ సలాం కొట్టాల్సి వస్తుంది. ఓటీటీ లు పెట్టిన డేట్స్ కే సినిమాలు రిలీజ్ అవ్వాలి. కాదు మేము పోస్ట్ పోన్ చేస్తామంటే డీల్ లో కోత పెడుతున్నాయి. దానితో నిర్మాతలకు లాస్.

ఇప్పుడు కూడా రెండు బిగ్ ప్రాజెక్ట్స్ కి ఆ డిజిటల్ హక్కులు కొన్న రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు పెట్టిన కండిషన్స్ చూస్తే.. ఇక నిర్మాతల పనైపోయినట్లే అనిపించక మానదు. అవి ప్రభాస్ ఫౌజీ, బాలయ్య దాదా చిత్రాలు. ప్రభాస్ ఫౌజీ డిసెంబర్ 3 రిలీజ్. ఈ చిత్రంపై ఉన్న అంచనాలతో సదరు ఓటీటీ సంస్థ బిగ్ డీల్ ఆఫర్ చెయ్యడమే కాదు, కండిషన్స్ కూడా పెట్టిందట.

అంటే డిసెంబర్ 3న ఖచ్చితంగా థియేటర్స్ లోకి సినిమా విడుదలవ్వాలి, డేట్ మారిస్తే కోత తప్పదని చెప్పిందట. ఇక డిసెంబర్ 24 న రావాల్సిన బాలయ్య దాదా కూడా ఎట్టి పరిస్తితుల్లోనూ డేట్ మారకూడదు అని దాని ఓటీటీ సంస్థ కండిషన్ పెట్టిందని తెలుస్తుంది. బాలయ్య త్వరగా కోలుకుని షూటింగ్ పూర్తి చేసేస్తే దాదా టార్గెట్ రీచ్ అవుతుంది.

లేదంటే దాదా ఓటీటీ డీల్ నుంచి కోత పడుతుంది. కేవలం ఫౌజీ, దాదా లే కాదు చాలా సినిమాలు ఇలా ఓటీటీ కండిషన్స్ కి లోబడి విడుదల తేదీల విషయంలో నలిగిపోతున్నాయి. 
 

OTT Deals Put Pressure On Prabhas Fauzi and Balakrishna Dada