కూతురుతో కలిసి దీపికా బేబీ బంప్ ఫోటో షూట్

CineJosh news


బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ ఏడాది రెండో ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసారు. ఇంతకుముందు దీపికా, రణ్వీర్ సింగ్ దంపతులకు 2024 లో దువా అనే పాప ఉంది. ఇక ఈ ఏడాది రెండో ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసాక దీపికా పదుకొనే బయట పెద్దగా కనిపించింది లేదు. అల్లు అర్జున్ తో చేస్తున్న రాకా షూటింగ్ ఫినిష్ చేసేసింది.

ఇక దీపికా బేబీ బంప్ ఫొటోస్ కూడా బయటకు రాలేదు. తాజాగా రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే తమ కూతురు దువా తో కలిసి బేబీ బంప్ ఫోటో షూట్ లో పాల్గొనడమే కాదు.. ఆ ఫొటోస్ ని దీపికా, రణ్వీర్ సింగ్ లు సోషల్ మీడియాలో షేర్ చేసారు. కుమార్తె దువా తో కలిసి దీపికా బేబీ బంప్ ఫొటోస్ షూట్ చేయించుకుంది.

ప్రస్తుతం దీపికా పదుకొనే బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక దీపికా అట్లీ-అల్లు అర్జున్ రాకా, షారుఖ్ తో కింగ్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది.