నందన అరెస్ట్: ఇపుడేం జరుగుతుంది

Nandu's World Nandana Arrested Nandu's World Nandana Arrested


నందూస్ వరల్డ్ అంటూ యూట్యూబ్ ఛానల్ తో, సోషల్ మీడియాతో తెగ ఫేమస్ అయిన రమ నందన ఆమె భర్త మధుకర్ లు యుకె లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎంతోమందిని మోసం చేసిన కేసులో రమ నందన ఇంకా మధుకర్, మధుకర తండ్రి పై ఏపీలో పలు కేసులు నమోదు అయ్యాయి. దానితో నందన ఇంక ఆమె భర్త మధుకర్ లపై ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసారు.

నిన్న సోమవారం నందన యుకె నుంచి హైదరాబాద్ రాగానే ఆమెను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే మొత్తం వ్యవహారంలో అసలు తమ తప్పు లేదు అని నందన వాదిస్తుంది. కావాలనే తమను నెగెటివ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అని ఆమె పలుమార్లు వీడియోస్ చేసింది.

తాజాగా యుకె నుంచి వస్తున్న రమ నందన ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీ ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పజెప్పారు.

CoS లో వీసా రెన్యూవల్ కోసం లక్షల్లో వసూలు చేసి మోసం చేసిన కేసులో నందనను అరెస్ట్ అయ్యింది. మరి నందనకు ఈ కేసులో నందనకు ఎలాంటి శిక్ష పడుతుంది, మధుకర్ ని ఏం చేస్తారు. కంపెనీ లావాదేవీలు, ఈ కేసులో పలు కోణాల్లో దర్యాప్తు చేసి ఈ నందూస్ వరల్డ్ దంపతులకు ఏ శిక్ష వేస్తారు అనేది సోషల్ మీడియా మొత్తం ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.

Nandu's World Nandana Arrested At Shamshabad Airport