ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> The Paradise To Have Early Worldwide Premieres

ప్యారడైజ్ ఊహాగానాలకు చెక్

The Paradise To Have Early Worldwide PremieresThe Paradise To Have Early Worldwide Premieres


నేచురల్ స్టార్ నాని-శ్రీకాంత్ ఓదెల కలయికలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ మూవీ పలుమార్లు వాయిదా పడి చివరకు ఈ నెల 24 న విడుదల అంటూ అనౌన్స్ చేసారు. కానీ ఇప్పుడు సెప్టెంబర్ 24 కి కూడా ది ప్యారడైజ్ రాకపోవచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇంకా షూటింగ్, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాలేదు, పాన్ ఇండియా ప్రమోషన్స్ కి సమయం సరిపోని కారణముగా ప్యారడైజ్ ని పోస్ట్ పోన్ చేస్తున్నారనే రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. నిజంగానే పాన్ ఇండియా ప్రమోషన్స్ కోసం టీమ్ 15 రోజులు కేటాయిస్తే ఏం సరిపోతుంది. సినిమాపై పాన్ ఇండియా మార్కెట్ లో బజ్ క్రియేట్ అవ్వాలంటే పక్కా ప్రమోషన్స్ కావాలి.

అందుకే ప్యారడైజ్ మరోసారి వాయిదా అన్న వార్తలు బాగా స్ప్రెడ్ అవడము, అందరూ నమ్మేయ్యడమూ చక చకా జరిగిపోయాయి., కానీ ప్యారడైజ్ అనుకున్న సమయానికే అంటే ఈనెల 24 నే ఎట్టి పరిస్థితిల్లో రిలీజ్ అవుతుంది అని మేకర్స్ చెబుతున్నారు. ప్యారడైజ్ రిలీజ్ పోస్ట్ పోన్ పై వస్తున్న ఊహాగానాలు నమ్మొద్దని, టార్గెట్ ప్రకారమే సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుంది అని, అలాగే ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. 

Nani The Paradise Release Date Locked For September 24