ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ అసంతృప్తి
Mega fans unhappy with Vasishta
మెగా ఫ్యాన్స్ లో దర్శకుడు వసిష్ఠపై తీవ్ర అసంతృప్తి కనిపిస్తుంది. కారణం మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర విషయం తేల్చకుండా ఆయన బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చెయ్యడానికి రెడీ అవడం మెగా ఫ్యాన్స్ అసంతృప్తికి కారణమైంది.
వసిష్ఠ నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా ప్రకటన వచ్చినప్పటినుంచి మెగా ఫ్యాన్స్ కుత కుత ఉడికిపోతున్నారు. విశ్వంభర ని గాలికొదిలేసి, ఆ సినిమా రిలీజ్ డేట్ ఇవ్వకుండా వసిష్ఠ నందమూరి కాంపౌండ్ లోకి అడుగుపెడుతున్నారు అని వారికి మంట.
చిరు తో తెరకెక్కించిన విశ్వంభర చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు. ఆ క్లారిటీ ఇవ్వకుండా వసిష్ఠ మోక్షజ్ఞ సినిమా విషయంలో తెరపైకి వచ్చారు. మెగా ఫ్యాన్స్ ఎలా ఉన్నా నందమూరి ఫ్యాన్స్ లో హోప్స్ మొదలయ్యాయి. మోక్షజ్ఞ ఎట్టకేలకు వెండితెరకు పరిచయమవుతున్నాడు అని వారు హ్యాపీగా ఫీలవుతున్నారు.







































