ఎన్టీఆర్ డ్రాగన్ లోకి బాలీవుడ్ క్రేజీ స్టార్స్ ఎంట్రీ
Explosive Addition To NTR Dragon Casting
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ చిత్రం పై పాన్ ఇండియా మార్కెట్ లో భీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎన్టీఆర్ భుజానికి తగిలిన గాయంతో వాయిదా పడింది. ఈ చిత్రంలో క్రేజీ స్టార్స్ నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ చిత్రంలోకి ఇప్పుడు బాలీవుడ్ క్రేజీ స్టార్స్ ఎంటర్ అవుతున్నారు. మలయాళ స్టార్ హీరో తొవినో థామస్ నటించాల్సి ఉండగా.. ఆయన ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ భర్తీ చేస్తున్నారనే న్యూస్ నడిచింది. అది నిజమే.. డ్రాగన్ లోకి బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, అలాగే ఆలియా భట్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
డ్రాగన్ లో షాహిద్ కపూర్ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనుండగా, ఆలియా భట్ కీలకమైన పాత్రలో ఎన్టీఆర్ సరసన నటిస్తుండగా.. రుక్మిణి వసంత్ హీరోయిన్ పాత్రలో కనిపించనున్నది.







































