గోల్డ్ కలర్ డ్రెస్సులో అనుపమ మెరుపులు
Anupama Parameswaran Glows In Gold-On-Gold Styling
కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్యనే ప్రేమలో ఆటుపోట్లు ఎదుర్కొని బ్రేకప్ చెప్పి అందులోనుంచి బయటపడి పనిలో పడింది. గత రెండేళ్లుగా అనుపమ కోలీవుడ్ హీరో ధృవ్ విక్రంతో ప్రేమలో ఉంది అనే ప్రచారం జరిగింది. ఆ విషయన్ని అనుపమ పరమేశ్వరన్ బయటపెట్టకముందే బ్రేకప్ వార్తలు సోషల్ మీడియాని కమ్మేశాయి.
ప్రేమ, బ్రేకప్ పై అనుపమ ఇండైరెక్ట్ గా ఓపెన్ అవుతూ.. తాను ప్రేమలో నరకం చూసాను, తాను ఎన్ని విధాలుగా అవమానపడాలో అన్ని విధాలుగా అవమాన పడ్డాను, అందులో నుంచి బయటపడి డిప్రెషన్ లోకి వెళ్ళాను అంటూ అనుపమ పరమేశ్వరన్ చేసిన కామెంట్స్ ఎంతగా వైరల్ అయ్యాయో చూసాము.
ప్రస్తుతం తన సినిమాల షూటింగ్స్ చేసుకుంటూ, ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అనుపమ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూసి వావ్ అనాల్సిందే. గోల్డ్ కలర్ స్లీవ్ లెస్ కాస్ట్యూమ్ లో అనుపమ పరమేశ్వరన్ హుందాగా, బ్యూటిఫుల్ గా మెరిసింది. గోల్డ్ కలర్ డ్రెస్ లో గోల్డెన్ బ్యూటీగా అనుపమ కొత్త లుక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.







































