ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jailer 2 release date: Makers of Rajinikanth-starrer dismiss delay rumours

సూపర్ స్టార్ వెనక్కి తగ్గట్లేదు

Jailer 2 release date: Makers of Rajinikanth-starrer dismiss delay rumoursJailer 2 release date: Makers of Rajinikanth-starrer dismiss delay rumours


సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్ 2 . నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ 2 ఈ దసరాకు రావడం లేదు, అక్టోబర్ 15 నుంచి పోస్ట్ పోన్ అవ్వబోతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. జైలర్ 2 దసరా నుంచి పోస్ట్ పోన్ అయ్యి దివాళి కి వెళ్ళిపోతుంది అన్నారు.

అందులో జైలర్ 2 రీ షూట్ వార్తలు ఆ విడుదల వాయిదా వార్తలను నమ్మేలా చేసాయి. కానీ జైలర్ 2 పోస్ట్ పోన్ వార్తల్లో ఎలాంటి నిజం లేదు, ముందు అనుకున్నట్టుగానే జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 నే ఉండబోతుంది అని మేకర్స్ వాయిదా వార్తలను కొట్టిపారేశారు. మరోమారు అదే తేదీ పై క్లారిటీ ఇచ్చేసారు.

మరి సూపర్ స్టార్ జైలర్ 2 అక్టోబర్ 15 అని ఫిక్స్ అయితే ఆతర్వాత రోజు రాబోతున్న విజయ్ దేవరకొండ రణబాలి మరికొన్ని చిత్రాల పరిస్థితి ఏమిటో , సూపర్ స్టార్ వెనక్కి తగ్గట్లేదు కాబట్టి ఆ దసరా రేస్ నుంచి ఎవరు తప్పుకుంటారో చూడాలి. 

Rajinikanth's Jailer 2 To Release On October 15