OG 2: అదిరిపోయే సర్ ప్రైజ్ రాబోతుంది
OG 2 update soon
పవన్ కళ్యాణ్ బర్త్ డే కి OG 2 నుంచి బిగ్ సర్ ప్రైజ్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కమిట్మెంట్స్ లో OG 2 మాత్రమే ఉంది. సురేందర్ రెడ్డితో అనౌన్స్ చేసిన మూవీ ముందుకు వెళ్ళలేదు, కానీ OG 2 మేకర్స్ అనౌన్స్ చెయ్యడమే కాకుండా తెగ హడావిడి చేసారు.
అందుకే పవన్ ఫ్యాన్స్ కూడా OG 2 ట్రీట్ పవన్ బర్త్ డే కి ఇవ్వాలని కోరుకున్నారు. అందుకు తగ్గట్టే దర్శకుడు సుజిత్ మాత్రం OG 2 మొదలు పెట్టలేదు గనక సింపుల్ గా చిన్న సర్ ప్రైజ్ పవన్ బర్త్ డే కి ప్లాన్ చేసారు. OG సెట్ లో తాను పవన్ తో డిస్కర్స్ చేస్తున్న రెండు పిక్స్ ని వదులుతూ..
చిన్నప్పటి నుండి నేను ఎంతో అభిమానించిన వ్యక్తికి...
ఒక అభిమానిగా మిమ్మల్ని వెండితెరపై చూడటం నుండి... కెమెరా వెనుక నిలబడి "యాక్షన్" అని చెప్పే స్థాయికి చేరడం... ఇది ఇప్పటికీ ఒక కలలా అనిపిస్తోంది...
కోట్లాది మందిలాగే, మీలోని ఆవేశాన్ని, మీ శైలిని మరియు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా నిలిపే ప్రతి అంశాన్ని ఆరాధిస్తూ నేను పెరిగాను 🧿❤️
మీరు సృష్టించిన అద్భుత క్షణాలను కేవలం ఆస్వాదించే స్థాయి నుండి, మీతో కలిసి ఒక అద్భుతమైన క్షణాన్ని సృష్టించే అవకాశాన్ని జీవితం నాకు కల్పించింది.
మొదట నా హీరో.
ఇప్పుడు నా 'OG'. 🔥
పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. ❤️
సాయంత్రం 4:05 గంటలకు #OGUniverseలో మిమ్మల్ని కలుద్దాం - ఇది ఒక చిన్న కానుక :) 🧿🧿 అంటూ పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్ డేట్ అందించారు సుజిత్.







































