బాలీవుడ్ స్టార్ కి స్వైన్ ఫ్లూ
Emraan Hashmi diagnosed with Swine Flu
బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. కొన్నేళ్ల క్రితం తీవ్ర రూపం దాల్చి అందరిని భయపెట్టిన ఈ స్వైన్ ఫ్లూ రీసెంట్ టైమ్స్ లో పెద్దగా వినిపించకపోయినా.. కొద్దిరోజులుగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ విజృంభణ గురించిన వార్తలు వింటున్నాము. తాజాగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ స్వైన్ ఫ్లూ బారిన పడడం కలకలం సృష్టించింది.
కొద్దిరోజులుగా తీవ్ర అస్వస్తతతో బాధపడుతున్న ఇమ్రాన్ హష్మీకి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆయనకు పాజిటివ్ గా తేలింది. ఇమ్రాన్ హష్మీ సినిమా షూటింగ్ నిమిత్తం ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నారు. రీసెంట్ గా రాంచీలో జరిగిన షూటింగ్ ముగించుకుని ముంబైకి చేరుకున్న ఆయన అనారోగ్యం బారిన పడగా.. డాక్టర్స్ ని సంప్రదించగా ఆయనకు అన్ని టెస్ట్ లు నిర్వహించగా అందులో ఇమ్రాన్ హష్మీ కి స్వైన్ ఫ్లూ సోకినట్లు డాక్టర్స్ నిర్దారించారు.
ప్రస్తుతం ఆయనను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, అంతేకాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్స్ సూచించారు. ఇక ఇమ్రాన్ హష్మీ ఈమధ్యనే ఆవారాపన్ 2 చిత్రంతో హిట్ కాదు కాదు తన కెరీర్ లోనే సూపర్ హిట్ కొట్టి ఫస్ట్ టైం రూ.100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టారు.







































