ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sudev Nair addresses Toxic direction rumours

టాక్సిక్ షాడో డైరెక్ట‌ర్ పై సుదేవ్ నాయ‌ర్ క్లారిటీ!

Sudev Nair addresses Toxic direction rumoursSudev Nair addresses Toxic direction rumours

రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `టాక్సిక్: ఎ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్-అప్స్` చుట్టూ  కొన్ని కొద్దిరోజులుగా నడుస్తున్న వివాదాలు, వదంతులపై నటుడు సుదేవ్ నాయర్  స్పందించారు. ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన సుదేవ్ ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న షాడో డైరెక్షన్ఆ రోపణలను ఖండించారు. యష్ ఈ సినిమా దర్శకత్వంలో జోక్యం చేసుకుంటున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

`టాక్సిక్` సినిమా పూర్తి విజన్ .. దర్శకత్వ బాధ్యతలు కేవలం గీతూ మోహన్‌దాస్  కి మాత్రమే చెందినవని తెలిపారు. ఆమె మేకింగ్ స్టైల్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని.. ఒక దర్శకురాలిగా కథను తెరపైకి తీసుకురావడంలో ఆమెకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. సెట్స్‌పై ప్రతి షాట్, ప్రతి సన్నివేశం ఆమె ఆలోచనల నుంచే రూపుదిద్దు కున్నాయని  వివరించారు.

హీరో యష్ పాత్ర గురించి వివరిస్తూ.. ఆయన కేవలం ఒక నటుడిగా, ప్రొడక్షన్‌లో భాగస్వామిగా మాత్రమే తన బాధ్యతలను నిర్వర్తించారని సుదేవ్ పేర్కొన్నారు. స్టార్‌డమ్ ఉన్న నటుడైనప్పటికీ, యష్ ఎప్పుడూ దర్శకురాలి పనిలో .. షాట్ మేకింగ్‌లో జోక్యం చేసుకోలేదని  స్పష్టం చేశారు. నటుడిగా తన పాత్రకు వంద శాతం న్యాయం చేయడంపైనే యష్ దృష్టి పెట్టారని  వెల్లడించారు.

పెద్ద స్టార్ హీరోలు ఉన్నప్పుడు  ఇండస్ట్రీలో ఇలాంటి షాడో డైరెక్షన్ ఆరోపణలు రావడం సహజమేనని కానీ టాక్సిక్ విషయంలో అది పూర్తిగా అవాస్తవమని సుదేవ్ స్పష్టం చేశారు. గీతూ మోహన్‌దాస్ వంటి ప్రతిభావంతురాలైన దర్శకురాలి పనితనాన్ని తగ్గించి చూపించడానికే కొందరు ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్నారని  మండిపడ్డారు. సెట్స్‌లో ప్రతి ఒక్కరూ ఆమె దర్శకత్వానికి లోబడి పనిచేశారని తెలిపారు.

 

Sudev Nair: Toxic is completely Geetu Mohandas vision