ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nandamuri Vasundhara Ties Rakhi to Daggubati Venkateswara Rao

రాఖి వీడియోలో బాలయ్య

Nandamuri Vasundhara Ties Rakhi to Daggubati Venkateswara Rao Nandamuri Vasundhara Ties Rakhi to Daggubati Venkateswara Rao


నందమూరి బాలకృష్ణ NBK 111 సెట్ లో గాయపడి హైదరాబాద్ AIG ఆసుపత్రిలో మోకాలి సర్జరీ చేయించుకుని ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. బాలయ్య మోకాలి సర్జరీ వల్ల ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని షూటింగ్ వాయిదా వేశారు. బాలయ్య కోలుకుంటూ ఉండడంతో అక్టోబర్ 5 నుంచి కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట.

అయితే బాలయ్యకు సర్జరీ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు AIG ఆసుపత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శించిన ఫోటో బయటికి వచ్చింది తప్ప తర్వాత బాలయ్య ఎలా ఉన్నారో అనేది ఎవ్వరికి తెలియదు. కానీ బాలయ్య రెస్ట్ లో ఎలా ఉన్నారో అనేది ఈరోజు బయటకివచ్చిన రాఖి వీడియో చూసి ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు.

రీసెంట్ గా మోకాలి సర్జరీ చేయించుకున్న బాలయ్య రక్షాబంధన్ రోజు చైర్ పై పిల్లో, దాని మీద కాలు పెట్టుకుని ఉండగా ఆయన భార్య వసుంధర.. బాలయ్య అక్క పురంధరేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరావు కి రాఖి కట్టిన వీడియో ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోషల్ మీడియాలో షేర్ చేసారు.

బాలయ్య ఆ వీడియో లో సరదాగా నవ్వుతూ షార్ట్ వేసుకుని కాలుని చైర్ లో పెట్టుకుని కనిపించారు. ఆ వీడియో చూసి నందమూరి అభిమానులు ఆయన త్వరగా కోలుకుని సెట్ లోకి వచ్చేయ్యాలని కోరుకుంటున్నారు.

Nandamuri Vasundhara