థియేటర్స్ లో హైప్ ఎక్కించారా?

Chennai Love Story OTT TalkChennai Love Story OTT Talk

 

కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం చెన్నై లవ్ స్టోరీ. ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ బావుంది.. సెకండ్ హాఫ్ కూడా బావుంటే థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది.. ఇది సినీవిమర్శకులు అన్నమాట. థియేటర్స్ లో కల్ట్ హిట్టు అంటూ దర్శకుడు ఇంకా నిర్మాతలు చెన్నై లవ్ స్టోరీ ని తెగ ప్రమోట్ చేసారు.

థియేటర్ బిగ్ హిట్ అంటూ ఓటీటీ లోకి వచ్చిన చెన్నై లవ్ స్టోరీని ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలు ఈ మూవీ థియేటర్స్ లో ఎలా హిట్ అయ్యిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాంగ్స్ కానీ, అలాగే కొన్ని సీన్స్ థియేటర్స్ లో బాగున్నా.. ఓటీటీ లోకి వచ్చేసరికి తేలిపోయాయనే మాట వినిపిస్తుంది.

థియేటర్స్ లో సూపర్ అన్న ఫస్ట్ హాఫ్ ఓటీటీ లో యావరేజ్ అంటున్నారు. చాలా సీన్స్ నేచురల్ గా కాకుండా ఆర్టిఫీషియల్ గా ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు. ఓటీటీ లో చెన్నై లవ్ స్టోరీ పై విమర్శలతో పాటుగా ట్రోల్స్ కనిపిస్తున్నాయి.

ఇలాంటి సినిమాని థియేటర్స్ లో తెగ ఆడేసింది అంటూ హైప్ ఎక్కించారు. ఓటీటీ కి వచ్చేసారి దాని నిజ స్వరూపం బయటపడింది అంటూ చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Chennai Love Story OTT Public Talk