అల్లు క్యూట్ కిడ్స్ అండ్ పెట్స్

Allu Arjun Cute Kids and PetsAllu Arjun Cute Kids and Pets

 

తన పిల్లలను అల్లారుముద్దుగా పెంచడమే కాదు, పెంపుడు జంతువులను కూడా కుటుంబ సభ్యుల్లా ప్రేమగా చూసుకోవడంలో అల్లు ఫ్యామిలీ స్టైలే వేరు. తాజాగా అల్లు స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోషూట్‌లో అల్లు అయాన్, అల్లు అర్హ తమ క్యూట్ పెట్స్‌తో సరదాగా ఆడుకుంటూ కనిపించారు.

ఆ పెంపుడు జంతువులతో గడుపుతున్న సంతోషకరమైన క్షణాలు.. వారి మధ్య ఉన్న అనుబంధం అభిమానులలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతోంది. వాటిని కేవలం పెట్స్‌లా కాకుండా తమ సొంత ఇంట్లోని పసిపాపల్లా చూసుకుంటున్న తీరుపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఈ ఫోటోగ్రాఫ్స్ లో అల్లు స్నేహారెడ్డి మరోసారి తన మార్క్ స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. గత కొంతకాలంగా స్నేహా ఫ్యాషన్ సెన్స్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ కేజువల్ అండ్ క్లాసీ ఫోటోషూట్‌లోనూ ఎంతో స్టైలిష్ గా కనిపించారు. ఒకవైపు పిల్లల అమాయకత్వం... పెంపుడు కుక్కల క్యూట్‌నెస్‌తో పాటు స్నేహారెడ్డి  ఫ్యాషన్ ప్రెజెన్స్ ఈ పోస్ట్‌ను నెటిజన్లకు ప్రత్యేకమైన విజువల్ ట్రీట్‌గా మార్చేసింది.

Where is Allu Arjun? Fans ask as Sneha Reddy shares pics