ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kriti Sanon reacts to backlash over outfit

కుక్క‌ల‌కు వ‌ర్తిసాయంటూ సీత‌మ్మ కౌంట‌ర్!

Kriti Sanon reacts to backlash over outfitKriti Sanon reacts to backlash over outfit

బాలీవుడ్ నటి కృతి సనన్  నటించిన రక్షాబంధన్ జ్యువెల్లరీ కమర్షియల్ యాడ్ సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆ యాడ్‌లో అమ్మ‌డు ధరించిన దుస్తులు సాంప్రదాయ పండుగకు తగినట్లుగా లేవంటూ కొందరు నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ ట్రోలింగ్‌పై నటి కంగనా రనౌత్ కూడా స్పందించి  ఉద్దేశపూర్వకంగా ఉందంటూ కామెంట్ చేయడంతో  వివాదం మరింత ముదిరింది.

ఈ విమర్శలపై  కృతి సనన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ  నోట్‌ను షేర్ చేశారు. పండుగల  అసలు సారం మనం ధరించే దుస్తులలో లేదని.. బంధాలలోని భావోద్వేగాలలో, సంప్రదాయాల అర్థాలలో ఉంటుందన్నారు. రక్షాబంధన్ అనేది  పండుగ కాదని అది పరస్పర రక్షణకు ప్రతీక అయిన పవిత్రమైన బంధమని పేర్కొన్నారు.

తాను.. తన సోదరి ఒకరికొకరు రాఖీ కట్టుకుంటూ ఒకరికొకరు తోడుగా నిలుస్తామని కృతి తెలిపారు. ఈ ఆచారాలు తమ కుటుంబంలోని పెంపుడు కుక్కలకు కూడా వర్తిస్తాయని? ఎందుకంటే అవి కూడా కుటుంబంలో భాగమేనని  పేర్కొ న్నారు. సంప్రదాయాలు మారుతున్నప్పటికీ  మహిళా సంస్కృతిని  ఆమె ధరించే దుస్తుల ద్వారానే అంచనా వేయడం ఎప్పుడు మానివేస్తారంటూ?  కృతి ప్రశ్నించారు.

ఈ సందర్భంగా మహిళలు ఏం ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతాం? అంటూ కృతి సనన్ నేరుగా విమర్శకుల తీరును నిలదీశారు. సంస్కృతి .. సంప్రదాయాలు హృదయంలో ఉండాలి కానీ దుస్తుల నెక్ లైన్‌లో కాదంటూ  ఇచ్చిన  కౌంట‌ర్  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kriti Sanon faced online backlash for tying a rakhi to a pet dog