వారణాసి : రాజమౌళికే సాధ్యం
Rajamouli Mark: Varanasi To Be Dubbed In 50 Languages
ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి చిత్రంతో పాన్ ఇండియాలో బలమైన ముద్ర వెయ్యడమే కాదు, తన వెనుక దర్శకులకు పాన్ ఇండియా బాట పట్టించిన ఘనత ఆయనకే దక్కింది. రాజమౌళి ఈసారి పాన్ వరల్డ్ రేస్ లోకి వారణాసి ని సిద్ధం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సూపర్ స్టార్ మహేష్ హీరోగా వారణాసి చిత్రాన్ని తెరకెక్కించడమే కాదు.. ఈ చిత్రంపై పాన్ వరల్డ్ లో హైప్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా వారణాసి చిత్రం రికార్డ్ బ్రేకింగ్ లాంగ్వేజెస్ అంటే దాదాపుగా 50 లాంగ్వేజెస్ లో డబ్ చేసి విడుదల చేసేందుకు రాజమౌళి ప్లానింగ్ లో ఉన్నారట. దాని కోసం 1500 మంది డబ్బింగ్ ఆర్టిస్ట్ లు డబ్బింగ్ చెప్పబోతున్నారట. మరి ప్రమోషన్స్ అయినా, సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళే విషయమైనా, ఇలా ఏది చేసినా రాజమౌళి కే సాధ్యం అన్నట్టుగా ఇప్పుడు వారణాసి విడుదల విషయంలో రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం రాజమౌళి వారణాసి షూటింగ్ ఫినిష్ చేసే పనిలో సీరియస్ గా ఉన్నారు. త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి తీసుకెళ్లాలి అనేది ఆయన ఆలోచన. ఏప్రిల్ 7, 2027 అనుకున్న తేదీకే వారణాసి ని రిలీజ్ చెయ్యాలనే కసిగా రాజమౌళి తన హీరో-హీరోయిన్స్ తో జర్నీ చేస్తున్నారు.







































