విషాదం: ప్రముఖ నటుడు కన్నుమూత!
Actor Michael Wright, star of The Five Heartbeats, dies at 70
హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. `ది ఫైవ్ హార్ట్‌బీట్స్` చిత్రంలో అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రసిద్ద నటుడు మైఖేల్ రైట్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రైట్ 70వ ఏట తుదిశ్వాస విడిచారు. రైట్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు, సహనటులు , అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. మైఖేల్ రైట్ మరణ వార్త వెలువడినప్పటి నుంచి ఆయన కుటుంబ నేపథ్యం, నికర ఆస్తులు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారాయి.
ముఖ్యంగా మైఖెల్ రైట్ పోషించిన ఎడ్డీ కింగ్ జూనియర్ పాత్ర హాలీవుడ్ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయింది. ఆ పాత్రకు ఆయన పొసిన జీవం ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టింది.
1991లో రిలీజ్ అయిన `ది ఫైవ్ హార్ట్‌బీట్స్` సినిమా మైఖేల్ రైట్ కెరీర్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. రాబర్ట్ సండ్ దర్శకత్వంలో తెరకెక్కిన సంగీత ప్రధానమైన డ్రామాలో ఆయన నటనకు క్రిటిక్స్ నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత కూడా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి నైపుణ్యాన్ని చాటుకున్నారు.
గొప్ప కళాకారుడిగా మైఖేల్ రైట్ పరిశ్రమకు అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివి. టెలివిజన్ రంగంలోనూ రైట్ తనదైన ముద్ర వేసారు. ఆయన చుట్టూ ఉన్న అనేక వివాదాలు .. వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కొంటూనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన నటించిన చిత్రాలు భవిష్యత్తు తరాలకు కూడా ఇన్స్పిరేషన్గా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మైఖేల్ రైట్ ఆస్తులు ..ఆర్థిక పరిస్థితికి సంబంధించి అధికారిక వివరాలు స్పష్టంగా లేనప్పటికీ సుదీర్ఘ నటనా జీవితంలో ఆయన మంచి గుర్తింపుతో పాటు గౌరవప్రదమైన సంపాదనను ఆర్జించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మైఖేల్ రైట్ కెరీర్లో ఎన్నో విభిన్నమైన ..శక్తివంతమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఆయన నటించిన చిత్రాలు కమర్షియల్ విజయాన్నే కాకుండా, విమర్శకుల ప్రశంసలను కూడా పొందాయి. నటనపై ఆయనకున్న అంకితభావం ప్రతి చిత్రంలోనూ కనిపిస్తుంది. రైట్ నటించిన `ది ఫైవ్ హార్ట్‌బీట్స్` లో ఎడ్డీ కింగ్ జూనియర్ పాత్ర హాలీవుడ్ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలో రైట్ అభినయం, భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఒక్క సినిమాతో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా నటుడిగా తన రేంజ్‌ను పూర్తిగా మార్చుకున్నారు.
















































