Advertisement

మాస్ మహారాజ్ హిట్టు కాదు బ్లాక్ బస్టర్ కొట్టారు

Irumudi Public Talk


మాస్ మహారాజ్ రవితేజ వరసగా నిరాశ పరిచే ఫలితాలతో చాలా సతమతమవుతున్నారు. ఎలాగైనా హిట్టు కొట్టి బ్యాక్ బౌన్స్ అవ్వాలని రవితేజ కసిగా ఉన్నారు. అలాంటి సమయంలోనే శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ సినిమా అనగానే హా ఏముంది యావరేజ్ సినిమా రవితేజ ఖాతాలో పడుతుంది అనుకున్నారు. శివ నిర్వాణ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ తీస్తారు. కానీ అవి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భాలు లేవు.

కానీ మాస్ మహారాజ్ తో శివ నిర్వాణ తెరకెక్కించిన ఇరుముడి హిట్టు కాదు బ్లాక్ బస్టర్ హిట్టైంది. రవితేజ ఇరుముడి చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్ షోస్ నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేసింది. టాలీవుడ్ లో అయితే రవితేజ కెరీర్ బెస్ట్ రివ్యూస్ అందుకుంటున్నారు.

రవితేజ మాస్ పెరఫార్మెన్స్, తండ్రీ–కూతుళ్ల ఎమోషన్, ఇరుముడి  క్లైమాక్స్, శివ నిర్వాణ టేకింగ్ అన్నిటికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సెకండ్ హాఫ్ కాస్త డల్ గా ఉంది కానీ.. లేదంటే రవితేజ ఇరుముడి తో రికార్డ్ లు క్రియేట్ చేసేవారు అంటూ రవితేజ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఇరుముడి ని ట్రెండ్ చేస్తున్నారు.

Ravi Teja Irumudi Social Media Talk