ప్రకృతి వైద్యం కోసం కేరళకు పవన్

Deputy CM Pawan KalyanDeputy CM Pawan Kalyan

 

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబై లో భుజానికి సర్జరీ చేయించుకుని వచ్చాక కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటున్నారు. తర్వాత చేతికి బ్యాగ్ వేసుకుని పవన్ కళ్యాణ్ తన పనుల్లో బిజీ అయ్యారు. అయితే కొద్దితోజులుక్రితం అంటే ఆగష్టు 15 న పవన్ కళ్యాణ్ మరోసారి జ్వరం బారిన పడ్డారు. గతంలోనూ పవన్ తరచూ అనారోగ్యానికి గురయ్యారు.

అందుకే పవన్ కళ్యాణ్ రేపు శుక్రవారం కేరళకు వెళ్ళబోతున్నారు. రేపటి నుంచి 20 రోజుల పాటు కేరళలోని ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో  పవన్ కల్యాణ్ చికిత్స చేయించుకోనున్నారు. తరచూ అనారోగ్యానికి గురవుతున్న పవన్ కల్యాణ్... ప్రకృతి వైద్యంలో చికిత్స చేయించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. 

Pawan Kalyan