రజిని సినిమాలో అప్పుడు నాగ్ ఇప్పుడు రామ్

Ram To Play Key Role In DharmanRam To Play Key Role In Dharman


సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం తెలుగు హీరోలు విలన్స్ గా మారుతున్నారు. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సూపర్ స్టార్ రజినికాంత్ కూలి చిత్రంలో కింగ్ నాగార్జున నెగెటివ్ రోల్ పోషించారు. ఇప్పడు సూపర్ స్టార్ కోసం మరో తెలుగు హీరో విలన్ గా చేయబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది.

హీరో రామ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ధర్మన్ చిత్రంలో అల్లుడి పాత్రలో అది కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. హీరో రామ్ స్వీయ దర్శకత్వంలో మూవీ స్టార్ట్ చేసారు. ఇప్పుడు రజినీకాంత్ కోసం విలన్ గా మారుతున్నారంటున్నారు.

మరి కూలి చిత్రంలో నెగెటివ్ రోల్ లో కనిపించిన నాగ్ సైమన్ కు మంచి పేరొచ్చినా కూలి ప్లాప్ నాగార్జున కు హెల్ప్ అవ్వలేదు. మరి రామ్ కూడా రజిని సినిమాలో ఎంత కీ రోల్ ప్లే చేసినా అది ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారినా.. అది ఇంకా అఫీషియల్ కాకపోవడంతో నమ్మడానికి లేదు.
 

Ram Pothineni To Play Key Role In Rajinikanth’s Dharman