ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aamir Khan shares special note for SM, SD

అగ్ర హీరోల స్నేహంపై వైరల్ అవుతున్న పోస్ట్!

Aamir Khan shares special note for SM, SDAamir Khan shares special note for SM, SD

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తాజాగా ప్రాజెక్ట్ `7 డాగ్స్` విడుదల సమయానికి సంబంధించి ఆసక్తి కరమైన  నోట్‌ను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రియమైన స్నేహితులు, తోటి స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, సౌదీ అరేబియా జనరల్ ఎంటర్‌టైనర్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ తుర్కి అల్-షేక్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో వారి మధ్య ఉన్న అనుబంధాన్ని చాటుతున్న ఈ పోస్ట్ సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

సినిమా రంగంలో ఎన్నో దశాబ్దాలుగా కలిసి ప్రయాణిస్తున్న సల్మాన్ ఖాన్ - సంజయ్ దత్ తన జీవితంలో ఎంత ముఖ్యమైనవారో అమీర్ ఖాన్ ఈ నోట్‌లో గుర్తు చేసుకున్నారు. కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా నిలిచిన  ముగ్గురు దిగ్గజ నటులు మరోసారి తమ స్నేహబంధం తో వార్తల్లో నిలిచారు. అలాగే గ్లోబల్ ఎంటర్‌టైనర్‌మెంట్ రంగంలో అద్భుతమైన మార్పులు తీసుకువస్తున్న తుర్కి అల్-షేక్ అందించిన సహకారాన్ని కూడా అమీర్ ఖాన్ ప్రత్యేకంగా అభినందించారు. ముగ్గురు ఎంతో కాలంగా  అన్న‌ద‌మ్ములా క‌లిసి ఉంటున్నామ‌ని..ఒక‌రి క‌ష్ట సుఖాలు మ‌రోక‌రు పంచుకుంటామ‌ని నోట్ లో పేర్కొన్నారు. ఆ బాండింగ్ త‌మ మ‌ధ్య ఎప్ప‌టికీ ప‌దిలంగానే  ఉంటుంద‌న్నారు.

`7 డాగ్స్` చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న  సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అమీర్ ఖాన్ పంచుకున్న స్పెషల్ నోట్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా ఒకరి విజయాలను మరొకరు అభినందించుకోవడం ఈ బంధాన్ని మరింత బలపరుస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Aamir Khan shares special note for 'Brothers' Salman Khan, Sanjay Dutt