విశ్వంభర: ఉత్కంఠ ప్లేసులో మెగాగ్రహం

Mega Fans Awaited Vishwambhara


మెగాస్టార్ బర్త్ డే కి మరో రెండు రోజుల సమయమే ఉంది. ఒకపక్క చిరు-బాబీ కలయికలో తెరకెక్కుతున్న మెగా 158 వార్తలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ అవుతుంటే.. మరోపక్క ఆయన లేటెస్ట్ చిత్రం విశ్వంభర నుంచి ఉలుకు పలుకు లేదు.

నిన్నటివరకు ఎంతో ఉత్కంఠ తో ఎదురు చూసిన మెగా అభిమానుల్లో ఆసక్తి స్థానంలో ఆగ్రహం మొదలయ్యింది. చిరు బర్త్ డే కి కూడా విశ్వంభర అప్ డేట్ విషయంలో ఇలా ఎందుకు సైలెంట్ గా ఉన్నారో తెలియక మెగా ఫ్యాన్స్ చిరాకు పడుతున్నారు. మెగా 158 అప్ డేట్స్ తో సంతోషించాలో.. వశిష్ట సైలెన్స్ ని భరించాలో తెలియక మెగా ఫ్యాన్స్ మధనపడుతున్నారు.

నిజంగానే వసిష్ఠ విశ్వంభర విషయంలో ఎందుకింత సైలెంట్ గా ఉన్నారో తెలియదు కానీ.. విశ్వంభర విడుదల తేదీ పక్కనపెట్టి కనీసం ఏదైనా గ్లింప్స్ ప్లాన్ చేస్తారో, లేదో తెలియదు. ఈ విషయంలో దర్శకుడు వశిష్ట మాత్రం మెగాగ్రహం బారిన పడి విలవిలలాడాల్సిందే.  

Chiranjeevi Vishwambhara