NBK 112 రూమర్స్ నమ్మకండి
NBK-KoratalaSiva film is still on
గత రెండు రోజులుగా నందమూరి బాలకృష్ణ-కొరటాల శివ కలయికలో పూజా కార్యక్రమాలతో మొదలైన NBK 112 చిత్రం ఆగిపోయింది. కొరటాల కు దేవర 2 చిత్రం తో పాటుగా NBK 112 చిత్రం మేకర్స్ కూడా హ్యాండ్ ఇచ్చారు, బాలయ్యతో కొరటాల సినిమా తెరకెక్కించే ఛాన్స్ మిస్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో ఒకటే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే NKB 112 పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మేకర్స్ ఖండించారు. ఈ ప్రాజెక్ట్ పై వస్తున్న ఎలాంటి వదంతులు నమ్మొద్దు అని, ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా పట్టాలెక్కుతోంది అని తెలిపారు. బాలయ్య కోలుకోగానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 ప్రాజెక్ట్ పూర్తి కాగానే... కొరటాల తో బాలయ్య ప్రాజెక్ట్ రెగ్యులర్ షూట్ మొదలవుతుంది అని క్లారిటీ ఇచ్చారు.
మరి సడన్ గా ప్రచారంలోకి వచ్చిన ఈ రూమార్స్ ఇప్పుడు నిర్మాతల క్లారిటీ తో ఆగుతాయో.. ఇంకా స్ప్రెడ్ అవుతాయో చూడాలి. ప్రస్తుతం బాలయ్య మోకాలి సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు సరవ్వగానే గోపీచంద్ మలినేని NBK 111 ప్రాజెక్ట్ షూట్ లో జాయిన్ అవుతారు.
















































