బిగ్ బాస్ పరువు మొత్తం పాయే !

Bigg Boss Agnipariksha 2Bigg Boss Agnipariksha 2

 

ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. బిగ్ బాస్ పై వస్తున్న నెగివిటీతో చిన్న సెలబ్రిటీస్ కూడా హౌస్ లోకి వెళ్లేందుకు వెనుకాముందు ఆడుతున్నారు. అందుకే బిగ్ బాస్ యాజమాన్యం అగ్నిపరీక్ష పెట్టి సామాన్యులను సెలెక్ట్ చేసి హౌస్ లోకి పంపిస్తున్నారు. గత సీజన్స్ హౌస్ లో కంటెస్టెంట్స్ పై వస్తున్న నెగివిటీతో వారు డిప్రెషన్ లోకి వెళుతున్నారు.

ఫేమ్, డబ్బు కన్నా వారి వారి ఆరోగ్యాలపై బిగ్ బాస్ ఎఫెక్ట్ పడుతూ ఉండడంతో అంతో ఇంతో పేరున్న నటులు ఎవరూ బిగ్ బాస్ పై ఆసక్తి చూపించడం లేదు. అంతలా బిగ్ బాస్ పై చాలామందిలో నెగివిటి ఉంది. అలాంటి సమయంలో ఎక్కడో కొద్దిగా ఉన్న బిగ్ బాస్ పరువు ఇప్పుడు ఈ అగ్నిపరీక్ష సీజన్ 2 తో మట్టిలో కలిసిపోతుంది.

అగ్నిపరీక్ష లో పాల్గొని జెడ్జి ల నుంచి రిజెక్ట్ అయిన కంటెస్టెంట్స్ యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని బిగ్ బాస్ పరువు తీసేస్తున్నారు. అగ్నిపరీక్ష జెడ్జిలు అసలు పనిలేక ఖాళీగా ఉన్నారు. వారికే సినిమాలు లేవు, మమ్మల్ని వారు ఎలా జెడ్జ్ చేస్తారు. యాంకర్ శ్రీముఖి ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం.

నవదీప్ కి బిందు మాధవికి, అభిజిత్ కి సినిమాలే లేవు, వారు కావాలనే టార్గెట్ చేసి మా కడుపు కొడుతున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షో కి వెళ్లి మమ్మల్ని మేము నిరూపించుకోవాలి అనుకున్నా ఈ అగ్నిపరీక్ష జెడ్జి లు మమ్మల్ని అవమానిస్తున్నారు అంటూ బిగ్ బాస్ పరువు తీసేలా రిజెక్ట్ అయిన కంటెస్టెంట్స్ మాట్లాడుతున్నారు.

Bigg Boss 10 : Agnipariksha 2