అటు శ్రీముఖి ఇటు నవదీప్
Bigg Boss Agnipariksha 2
బిగ్ బాస్ సీజన్ 10 కోసం అగ్నిపరీక్ష 2 మొదలయ్యింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు అగ్నిపరీక్ష 2 లో పలు టాస్క్ లను ఎదుర్కోవడమే కాదు జెడ్జిలను ఇంప్రెస్స్ చేసి మరీ ఎంపికైన వారు హౌస్ లోకి అడుగుపెట్టాలి. అలా ఈ సీజన్ కోసం అగ్నిపరీక్ష 2 మొదలయ్యింది. అయితే కంటెస్టెంట్స్ అగ్నిపరీక్ష స్టేజ్ పైకి వచ్చి రిజెక్ట్ అయినవాళ్లు బయటికొచ్చి జెడ్జిలపై, యాంకర్ పై నోరు పారేసుకుంటున్నారు.
అగ్నిపరీక్ష 1 జెడ్జి లే అగ్నిపరీక్ష 2 కి కూడా జెడ్జిలుగా వచ్చారు. అభిజిత్, నవదీప్, బిందు మాధవి.. యాంకర్ గా శ్రీముఖి వచ్చారు. అయితే అగ్నిపరీక్ష 2లోకి వచ్చిన కంటెస్టెంట్స్ వారి గురించి చెప్పుకునే సందర్భంలో జెడ్జి లు అడిగిన ప్రశ్నలు తమను అవమాన పరిచేలా ఉన్నాయంటూ ఫైర్ అవుతున్నారు.
ఉప్పల్ బాలు అయితే జెడ్జి నవదీప్ తనను అవమానించాడు, అగ్నిపరీక్ష కు పిలిచి తనను అవమానించారు, నేను బిగ్ బాస్ కి పనికిరానా.. అంటూ ఉప్పల్ బాలు ఫైర్ అవ్వగా, ఇక యాంకర్ శ్రీముఖి అయితే రన్నింగ్ రాజా ను నన్ను టచ్ చేస్తే చెంప పగలగొడతా అంటూ దురుసుగా ప్రవర్తించింది అంటూ ఆమె అసలు ఊరులో గొర్రెలు కాచువడానికి కూడా పనికిరాదు అంటూ నెటిజెన్స్ శ్రీముఖి పై మండిపడుతున్నారు.







































