హీరోగా సక్సెస్.. దర్శకుడిగా డిమాండ్ పెరిగింది

Lokesh Kanagaraj DCLokesh Kanagaraj DC

 

కూలి చిత్రంతో బాగా డిజప్పాయింట్ చేసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి తదుపరి చిత్రానికి ఏ హీరో ఛాన్స్ ఇస్తాడో అనుకుంటున్న తరుణంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ తో సినిమా అనౌన్స్ చేసి షాకిచ్చారు. కూలి రిజల్ట్ తర్వాత అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ కి ఛాన్స్ ఇవ్వడంపై అల్లు ఫ్యాన్స్ లోను చాలా అనుమానాలు కలిగాయి.

అయితే AA 23 అనౌన్సమెంట్ వచ్చాక లోకేష్ కనగరాజ్ హీరోగా డీసీ చిత్రంలో నటించడమే కాదు రీసెంట్ గా డీసీ చిత్రంతో లోకేష్ కనగరాజ్ కూడా ఎక్స్పెక్ట్ చెయ్యని విజయాన్ని అందుకున్నాడు. తమిళంలోనే కాదు, తెలుగులోనూ డీసీ చిత్రాన్ని వీక్షించిన వారు సూపర్, డూపర్ అంటూ కామెంట్లు చేసారు.

ఈ చిత్రాన్ని ప్రమోషన్స్ లేకుండా విడుదల చెయ్యడంతో కొంతమందికి డీసీ రిజిస్టర్ కాలేదు కానీ.. లేదంటే లోకేష్ కనగరాజ్ డీసీ చిత్రం కలెక్షన్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసేది. ఇప్పుడు డీసీ విజయం తో లోకేష్ కనరాజ్ తదుపరి దర్శకుడిగా చెయ్యబోయే అల్లు అర్జున్ సినిమాపై హైప్ కేపెరిగేలా చేసింది.

హీరోగా సక్సెస్ అయ్యాడు, దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ కి మరోసారి డిమాండ్ పెరిగింది, ఆయన తో సినిమాలు చేసేందుకు స్టార్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారనే వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.  

Lokesh Kanagaraj - Allu Arjun AA23