టాక్సిక్ ట్రైలర్ ఒక్కటేనా నయన్

Nayanthara avoids Toxic audio launchNayanthara avoids Toxic audio launch


కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార మొదటి నుంచి సినిమా ప్రమోషన్స్ కి దూరం. సెంటిమెంట్ అంటుంది, ఎక్కువ పారితోషికం ఇస్తే కొన్ని ప్రమోషన్స్ లో కనిపిస్తుంది. తాజాగా పాన్ ఇండియా ఫిలిం టాక్సిక్ చిత్ర ప్రమోషన్స్ లో నయనతార కనిపిస్తుందా అనే విషయంలో ఎంత చర్చ జరిగిందో సోషల్ మీడియాలో చూసాం.

అయితే నయనతార రీసెంట్ గా బెంగుళూరులో జరిగిన టాక్సిక్ ట్రైలర్ లాంచ్ వేడుకలో చక్కటి చీర కట్టులో సందడి చేసింది. టాక్సిక్ లో చాలామంది స్టార్స్ ఉన్నారు, అలా ఆ సినిమాలో చెయ్యడం అంతగా ఇష్టం లేదు, కానీ గీతూ మోహన్ దాస్ కథ చెప్పాక నమ్మకం కలిగింది అంటూ హీరో యశ్ పైనా ప్రశంశలు కురిపించింది.

అక్కడి వరకు అంటే ట్రైలర్ లాంచ్ వేడుక వరకు వచ్చిన నయనతార మిగతా టాక్సిక్ ప్రమోషన్స్ ని లైట్ తీసుకుంది. గత రాత్రి జరిగిన టాక్సిక్ ఆడియో లాంచ్ వేడుకలో నయన్ తప్ప మిగతా హీరోయిన్స్ కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తార సుతారియా, రుక్మిణి వసంత్ అందరూ కనిపించారు.

కానీ నయన్ మాత్రం కనిపించలేదు. జస్ట్ ట్రైలర్ వేడుకతో ప్రమోషన్స్ కు నయన్ బై బై చెప్పేసింది అనుకుంటా అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు.

Nayanthara - Toxic