ఈ వయసులో ఏంటా స్పీడు రజినీ..

Dharman Shooting updateDharman Shooting update

 

యంగ్ హీరోలతో పోటీపడి మరీ సినిమాలు చేస్తున్నారు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.  జైలర్ 2 ని అక్టోబర్ లో విడుదలకు రెడీ చేస్తుంటే.. కమల్ హాసన్ ప్రొడక్షన్ లో మొదలు పెట్టిన ధర్మన్ చిత్ర షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసేసారు.

ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ అప్ డేట్ కూడా ఇవ్వడం చూసిన అభిమానులు ఏంటయ్యా రజిని ఈ వయసులో ఈ స్పీడు అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే డాక్టర్ ధర్మన్ గా సూపర్ స్టార్ ఫస్ట్ లుక్ అభిమానులను తెగ ఇంప్రెస్స్ చేసింది. ఇప్పుడు చిత్ర షూటింగ్ పరుగులు పెట్టిస్తున్నారు.

జైలర్ 2 షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ లోకి వెళ్లడంతో రజినీకాంత్ ఇప్పుడు ధర్మన్ షూటింగ్ కి షిఫ్ట్ అవడమే కాదు యంగ్ హీరో మాదిరి షూటింగ్ చుట్టేస్తున్నారు.

Dharman: Second Schedule Shooting Update