బ‌న్నీ విరామం ఎన్ని రోజులు?

Allu Arjun On Break

 

కాన్ స్టార్ అల్లు అర్జున్ `రాకా` ముంబై షూటింగ్ షెడ్యూల్స్‌తో ఎంత‌ బిజీగా ఉన్నారో తెలిసిందే. అయితే తాజాగా బ‌న్నీ హైదరాబాద్‌లో కనిపించడంతో `రాకా` షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడిందనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే విశాఖపట్నంలో ఘనంగా  సరికొత్త మల్టీప్లెక్స్ `అల్లు సినిమాస్` ను లాంచ్ చేసిన బన్నీ ఆ సంతోషం ముగియకముందే వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్నారు. ఈ చిన్న విరామం ఎంతకాలం ఉంటుంది? అనే దానిపై అభిమానుల్లో  చర్చ జరుగుతోంది.

సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా?  కుటుంబానికి .. వ్యాపార వ్యవహారాలకు సమయం కేటాయించడం బన్నీ ప్రత్యేకఐత. విశాఖ పర్యటనలో అభిమానుల నుంచి అపూర్వమైన స్వాగతం అందుకున్న బ‌న్నీ ఆ వెంటనే హైదరాబాద్‌లో కొన్ని ముఖ్యమైన పనుల కోసం  విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా బన్నీ ప్రతి షెడ్యూల్‌ను ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ఈ తాత్కాలిక బ్రేక్ కేవలం కొద్ది రోజుల పాటే ఉంటుందని.. త్వరలోనే  తిరిగి మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మరి హైదరాబాద్‌లో `రాకా` రి షెడ్యూల్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై త్వరలోనే అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ విరామంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ బన్నీ వేసే ప్రతి అడుగుపై అభిమానులు కన్నేసి ఉంచారు. రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి ఏదైనా మేజర్ లీక్ లేదా క్రేజీ అప్‌డేట్ వస్తుందేమోనని సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 

Raaka Shoot on Halt, Allu Arjun On Break