కొరియన్ కనకరాజు ప్రీమియర్ టాక్
Korean Kanakaraju Premiere Show Talk
మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రితిక నాయక్ నటించిన ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. గత రాత్రే ప్రీమియర్స్ తో కొరియన్ కనకరాజు సందడి చేసాడు.
కొరియన్ కనకరాజు ప్రీమియర్స్ టాక్ లోకి వెళితే.. వరుణ్ తేజ్ లుక్స్ పరంగాను, కామెడీ టైమింగ్ లోను అద్దరగొట్టేసాడు, ఫస్ట్ హాఫ్ లో వరుణ్ తేజ్-సత్య మద్యన కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యింది. ఇంటర్వెల్ ముందు వచ్చే కొరియన్ గ్యాంగ్స్, యాక్షన్ సన్నివేశాలు, థమన్ నేపధ్య సంగీతం వేరే లెవల్. థమన్ BGM సినిమాకి మెయిన్ హైలెట్ గా చెప్పుకోవచ్చు అంటూ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్వీట్లు వేస్తున్నారు.
హీరోలోకి ఆత్మ ప్రవేశించే సీన్, కొరియా నేపథ్యంలో తెరకెక్కన సీన్స్, కామెడీ, సెకండ్ హాఫ్ లో మురళీధర్ గౌడ్-సత్య ట్రాక్ బావుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ కొరియా నుంచి అనంతపురం వరకు కథను ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో నడిపిస్తూ ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టనివ్వలేదు. కానీ కొన్ని లాజిక్ లేని సీన్స్ ఇబ్బంది పెట్టాయి అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.
మరి కొరియన్ కనకరాజు ఫైనల్ రిపోర్ట్ ఏమిటి అనేది పూర్తి సమీక్షలో మరికాసేపట్లో..







































