షాకింగ్: వారణాసి నుంచి వీడియో లీక్

Shocking: Video leaked from VaranasiShocking: Video leaked from Varanasi

 

ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ఫిలిం వారణాసి చిత్రానికి సంబందించిన ప్రతి ఒక్క విషయాన్ని దాచి పెట్టకుండా రాజమౌళి సహా సూపర్ స్టార్ మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లు రివీల్ చేస్తూనే ఉన్నారు. కానీ వారణాసి లీకుల రాయుళ్లు మాత్రం టీమ్ ని పదే పదే ఇబ్బంది పెడుతున్నారు.

ఆఖరికి వారణాసి ఓపెన్ ఈవెంట్ విజువల్స్ నే లీక్ చేసారు ఈ మేధావులు. వారణాసి షూటింగ్ మొదలైనప్పుడే మహేష్ వీడియో లీక్ చేసారు. తాజాగా వారణాసి నుంచి మరో వీడియో లీకై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మహేష్ బాబు మీద చిత్రీకరిస్తున్న విజువల్స్ లీక్ అయినట్టు తెలుస్తుంది. దీనితో కొందరు అభిమానులు బాగా వర్రీ అవుతున్నారు.

ఆ వీడియో ని చాలామంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. మరి మేకర్స్ ఇలాంటి లీకుల రాయుళ్లకు ఎలా బుద్ధి చెప్పి ఇకపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. 

Varanasi leaked footage goes viral