Advertisement

కహానీ 3లో విద్యాబాలన్ స్థానంలో యామీ?

Yami Gautam will star in Kahaani 3

బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన థ్రిల్లర్ ఫ్రాంచైజీ `కహాని` మూడో భాగానికి సంబంధించి ఆసక్తికర వార్తలు ప్రచారంలోకి వ‌స్తున్నాయి. దర్శకుడు సుజోయ్ ఘోష్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ఇప్పటివరకు లీడ్ రోల్స్ పోషించిన విద్యాబాలన్ స్థానంలో  యామీ గౌతమ్ ని ఎంపిక చేస్తున్న‌ట్లు  సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

2012లో వచ్చిన `కహాని`, 2016లో రిలీజ్ అయిన  `కహాని2` చిత్రాలు ఎలాంటి విజ‌యం సాధించాయో చెప్పాల్సిన ప‌నిలేదు. వాటిలో విద్యాబాల‌న్ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు. క‌మ‌ర్శియ‌ల్ గాను రెండు భాగాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధించాయి. ఈనేప‌థ్యంలో మూడ‌వ భాగం ఎప్పుడొస్తుందా? అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులోనూ విద్యాబాల‌న్ య‌ధావిధిగా త‌న పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని అభిమానులు ఆశీస్తున్నారు.

కానీ ఈసారి విద్యాబాల‌న్ ఆ ఛాన్స్ తీసుకోవ‌డం లేదు. ఆమె స్థానంలో యామీ గౌతమ్ బోర్డులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న  సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు యామీ గౌతమ్ బాలాజీ మోహన్ దర్శకత్వంలో  `నయీ నవెల్లి` అనే సూపర్‌నేచురల్ ఫోక్ డ్రామా చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ  సినిమా అనంత‌రం క‌హానీ 3 పై క్లారిటీ వ‌చ్చే  అవ‌కాశం ఉంది.

Kahaani 3: Yami Gautam to replace Vidya Balan