హడావిడి చేసినా వర్కౌట్ అవ్వట్లే

Jaya Krishna Srinivasa MangapuramJaya Krishna Srinivasa Mangapuram


ఈమధ్యన కాస్త పేరున్న హీరోల సినిమాలు చూసేందుకు కూడా ప్రేక్షకులు వెనకడుగు వేస్తున్నారు. పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా.. మొదటిరోజు మొదటి షో టాక్ చూసాకే థియేటర్స్ కి వెళుతున్నారు. అందుకే స్టార్ హీరోలు కూడా ఓపెనింగ్స్ పరంగా రికార్డ్ లు సెట్ చెయ్యాలకపోతున్నారు. అంతలా ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయింది.

ఈ సమయంలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి రమేష్ కొడుకు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న శ్రీనివాస మంగాపురం ఈ నెల 30 న విడుదలకు సిద్దమైంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని లు గత నెల రోజులుగా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మంగళవారం ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మోహన్ బాబు ఈ చిత్రంలో నటించారు.

సూపర్ స్టార్ ఫ్యామిలీ హీరో అంటే ఏ రేంజ్ హైప్ ఉండాలి. కానీ శ్రీనివాస మంగాపురం పై ఎలాంటి హైప్ కనిపించడం లేదు. జయకృష్ణ హీరోగా ఆనుతున్నాడా, ఘట్టమనానికి అభిమానులు జయకృష్ణ కు ఎలాంటి వెల్ కమ్ చెబుతారనే విషయంలోనూ అనేక సందేహాలు, మరోపక్క శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్ లో సూపర్ స్టార్ మహేష్ కనిపిస్తారా..

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ కనిపిస్తే మొదటిరోజు ఓపెనింగ్స్ బావుంటాయి, లేదంటే అనేది అంతుబట్టడం లేదు. మరోపక్క మంగాపురం ప్రమోషన్స్ తో హడవిడి చేసినా అది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనే కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. చూద్దాం మరో వారంలో ఘట్టమనేని వారసుడి భవితవ్యం తేలిపోతుంది. 

Jaya Krishna - Srinivasa Mangapuram