రిలేషన్‌షిప్ రూమర్స్‌పై నటి స్పందన!
Shehnaaz Gill on love: Whether it's complete or not, it shouldn't matterప్రముఖ బాలీవుడ్ నటి, సింగర్ షెహనాజ్ గిల్ వ్యక్తిగత జీవితం.. డేటింగ్ రూమర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల కాలంలో నటుడు రాఘవ్ జుయల్‌తో అమ్మడు ప్రేమలో ఉందంటూ వస్తున్న పుకార్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షెహనాజ్ గిల్ ప్రేమ .. బంధాల గురించి మనసులోని మాటలను పంచుకున్నారు. ప్రతి బంధం ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదని.. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించకుండా ప్రస్తుత క్షణంలోనే జీవించాలన్నారు.
ప్రేమ అనేది ఎప్పుడూ అసంపూర్ణమైనదేనని.. అది నెరవేరినా ? నెరవేరకపోయినా దాని విలువ మారదని షెహనాజ్ అభిప్రాయపడ్డారు. రేపటి గురించి ఆందోళన చెందుతూ వర్తమానాన్ని కోల్పోకూడదని అభిమానులకు సూచించారు. ఎక్కువగా భవిష్యత్తును ఊహించుకోవడం వల్ల మానసిక వేదన కలుగుతుందని అందుకే ఉన్న క్షణాన్ని ఆనందంగా, నిజాయితీగా గడపడం ముఖ్యమని పేర్కొన్నారు.
ప్రస్తుతం తన దృష్టంతా తాజా ప్రాజెక్ట్‌లు .. కెరీర్‌పైనే పెట్టానని తెలిపారు. ఇలాంటి రూమర్స్‌ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. షెహనాజ్ గిల్ నటించిన తాజా చిత్రం `ఇష్క్‌నామా` ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. సరిహద్దు ప్రేమకథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమ్మడి నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి.








































