Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rakul Preet reveals her first paycheque was Rs 5 lakh

కారు కోసం హీరోయిన్ అయ్యిందట

Rakul Preet reveals her first paycheque was Rs 5 lakh


సౌత్ లో టాప్ పొజిషన్ ని ఎంజాయ్ చేసి అవకాశాలు తగ్గగానే ముంబై వెళ్లి అక్కడ అవకాశాలు కోసం ఫైట్ చెయ్యడమే కాదు బాలీవుడ్ నిర్మాతను వివాహమాడి ఫైనల్ గా ముంబై లో సెటిల్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్యన బాలీవుడ్ vs టాలీవుడ్ కల్చర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

తాజాగా తాను అసలు నటిని అవ్వాలనుకోలేదు. కానీ నేను చదువుకునే రోజుల్లో నా ఫోటో చూసి కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు మా అమ్మ నాన్నలను కలిసి నాకు ఓ ఆఫర్ ఇచ్చారు. నన్ను నటిగా తీసుకుంటామంటే నాకేం చేయాలో అర్ధం కాలేదు, కారణం నాకు సినిమాలపై, నటనపై అంతగా అవగాహన లేదు.

కానీ నాకు ఐదు లక్షలు ఇస్తాను అని చెప్పారు. అందుకే నేను నటిని అవ్వాలన్నా, కారణం కారు ఆకృ కొనుకోవచ్చు కదా అని. అప్పటికి మా ఫ్రెండ్స్ కి కార్లు ఎవరికీ లేవు. మా బ్యాచ్ లో అలా కారు కొనే మొదటి అమ్మాయిని నేనే అవుతా కదా అని. ఆతర్వాత నటన అంటే ఇష్టం మొదలైంది, కెమెరా ముందు కనిపించడం నచ్చింది, కానీ గ్రాడ్యువేషన్ అయ్యాకే పూర్తిస్థాయి నటనలోకి వచ్చాను అంటూ రకుల్ ప్రీత్ తనకు సినిమా ఆఫర్ ఎలా వచ్చింది అనేది చెప్పుకొచ్చింది. 

Rakul Preet Reveals She Took Her First Film