విజయ్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు

Vijay's fans are feeling really upsetVijay's fans are feeling really upset


ఏ హీరోకైనా బ్లాక్ బస్టర్ మూవీ తో ఫేర్ వల్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటారు. బ్లాక్ బస్టర్ కాకపోయినా ఎట్ లీస్ట్ సూపర్ హిట్ అయినా ఇవ్వాలని కోరుకుంటారు. కానీ కోలీవుడ్ హీరో విజయ్ చివరి చిత్రం జన నాయగన్ కి వస్తున్న ఫీడ్ బ్యాక్ చూసి విజయ్ అభిమానులు బాగా ఫీలవుతున్నారు.

జన నాయగన్ చిత్రానికి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ఇచ్చి విజయ్ కి మరిచిపోలేని ఫేర్ వల్ ఇవ్వాలని ప్లాన్ చేసిన విజయ్ ఫ్యాన్స్ కి దర్శకుడు వినోద్ ఇచ్చిన షాక్ మామూలుది కాదు. ఒక పెద్ద సినిమాని రీమేక్ కూడా సరిగ్గా చెయ్యలేక చెడగొట్టాడు. విజయ్ కి చివరి చిత్రానికి మచ్చ వేసాడు. విజయ్ చివరి చిత్రంగా చెప్పుకునే జన నాయగన్ తెలుగు, హిందీలో ప్లాప్.

అటు తమిళనాట కూడా యావరేజ్ టాక్ వచ్చింది. ఈ వీకెండ్ వరకు బుకింగ్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. కానీ సోమవారం నుంచి జన నాయగన్ ఆక్యుపెన్సీ తగ్గిపోతుంది. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూసి ఎన్నో ఏళ్లుగా స్టార్ స్టేటస్ మైంటైన్ చేసిన హీరో చివరి చిత్రం ఇలానేనా ఉండేది అని విజయ్ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు.

Jana Nayagan Public Talk