కళ్ళు తెరిపించిన కాజల్
Kajal Aggarwal calls South disciplined
ఈమధ్యన కొంతమంది హీరోయిన్స్ ఏరు దాటాక తెప్పతగలేశారు అన్నమాదిరి సౌత్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇక్కడే టాప్ పొజిషన్ కి వెళ్ళి వాళ్ళు బాలీవుడ్ లోకి వెళ్ళగానే సౌత్ ఇండస్ట్రీ పై విమర్శలు చెయ్యడం చూస్తున్నాం. ముఖ్యంగా తాప్సి, తమన్నా లాంటి వాళ్ళు సౌత్ ఇండస్ట్రీపై చేసిన విమర్శలు వాళ్ళ వాళ్ళ అభిమానులనే నొప్పించాయి.
కానీ కాజల్ అగర్వాల్ మాత్రం కళ్ళుమూసుకుపోయిన నారీమణులకు కళ్ళు తెరిపిస్తుంది. సౌత్ హీరోయిన్స్ పాత్రల విషయంలో ఒప్పుడు కన్నా ఇప్పుడు చాలా మార్పొచ్చింది. ఇప్పుడు హీరోయిన్స్ కి ప్రాధాన్యత ఉన్న పాత్రలు రాస్తున్నారు. నాకు సౌత్ లో వచ్చిన మంచి పాత్రలు, ప్రాధాన్యత ఉన్న పాత్రలు హిందీలో రావడం లేదు.
అసలు నేను ఎన్ని చిత్రాలు చేశాను అనే దానికంటే ప్రాధాన్యతగల పాత్రలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అలాంటి పాత్రలు సౌత్ లో నాకు కావాల్సినన్ని వస్తున్నాయి కాబట్టి బాలీవుడ్ లో ప్రాధాన్యత లేని పాత్రలు నేనెందుకు ఎంచుకోవాలి, బాలీవుడ్ సినిమా సెట్స్ లో ఏది సమయానికి జరగదు.
కానీ సౌత్ లో అలా కాదు, అన్ని టైమ్ టు టైమ్ జరుగుతాయి. సౌత్ ఇండస్ట్రీలో లో క్రమశిక్షణ ఉంటుంది, అది నేర్చుకున్నాను, కాబట్టి నేను కెరీర్ లో నిలదొక్కుకున్నాను, భాష నాకు ఎప్పుడూ అడ్డు రాలేదు అంటూ కాజల్ అగర్వాల్ సౌత్ vs హిందీ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.







































