Advertisement

కాకినాడ నుంచి హైదరాబాద్ కు బాలయ్య

Balayya Reaches AIG Hospital

 

నందమూరి బాలకృష్ణ కు నిన్న మంగళవారం కాకినాడ పోర్ట్ లో NBK 111 షూటింగ్ సెట్ లో జరిగిన ప్రమాదంలో ఆయన మోకాలికి దెబ్బ తగిలింది. యాక్షన్ సీన్ చిత్రీకరణలో భాగంగా బాలయ్య కాలు జారి పడిపోవడంతో మోకాలి దగ్గర గాయమవగా ఆయన్ను కాకినాడలోని ఆసుపత్రికి తరలించి చిత్ర బృందం చికిత్స ఇప్పించింది.

నిన్న కాకినాడలోనే విశ్రాంతి తీసుకున్న బాలకృష్ణ ఈరోజు హైదరాబాద్ కి చేరుకున్నారు. ఈరోజు గురువారం హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో నిపుణులైన వైద్యులు బాలయ్యను పరీక్షించిన తర్వాత మోకాలికి సర్జరీ అవసరమని నిర్ణయించారు. ఈరోజే ఆ సర్జరీ చేయనున్నట్లుగా తెలుస్తుంది.

సర్జరీ అనంతరం బాలకృష్ణ పూర్తిగా కోలుకోవడానికి నాలుగు నుంచి ఐదు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లుగా  తెలుస్తోంది. దానితో NBK 111 షూటింగ్ కి ప్రస్తుతానికి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. బాలయ్య కోలుకోవడానికి నెలపైనే పడుతుంది. 

Nandamuri Balakrishna