ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jana Nayagan: Firing In Tamil, Sleeping In Telugu

టాలీవుడ్ లో జన నాయగన్ పరిస్థితి

Jana Nayagan: Firing In Tamil, Sleeping In Telugu

 

తమిళనాట జన నాయగన్ ర్యాంపేజ్ ఆడిస్తుంది. అక్కడ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగానే హాట్ కేకులా టికెట్స్ తెగుతున్నాయి. విజయ్ చివరి చిత్రం అని జన నాయగన్ ను ప్రకటించడంతో విజయ్ అభిమానులతో పాటుగా జన నాయగన్ ను చూసేందుకు తమిళ ప్రేక్షకులంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అయితే తమిళంతో పాటుగా తెలుగు, హిందీలోనూ బుక్ మై షో లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే తెలుగులో జన నాయగన్ ప్రభావం అంతగా కనిపించడం లేదు. జన నాయగన్ చూసేందుకు తెలుగు ప్రేక్షకులు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బుక్ మై షో లో తెలుగు బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి.

తెలుగులో జన నాయగన్ టికెట్ బుకింగ్స్ డిజప్పాయింట్ చేతున్నాయి. మరోపక్క హిందీలోనూ జన నాయగన్ పై నార్త్ ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనిపించేలా హిందీ జన నాయగన్ బుకింగ్స్ ఉన్నాయి. మరి రిలీజ్ రోజుకి ఏమైనా జన నాయగన్ ప్రభావం తెలుగు, హిందీ భాషల్లో కనిపిస్తుందేమో చూడాలి. 

Jana Nayagan