మారుతి కి దొరికిన మెగా హీరో

Maruthi to direct Varun Tej Maruthi to direct Varun Tej


రాజా సాబ్ రిజల్ట్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఈమధ్యనే ఓ సినిమా ఈవెంట్ లో కనిపించిన దర్శకుడు మారుతి.. తర్వాత తదుపరి చిత్రం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. రాజసాబ్ తర్వాత మారుతి పనైపోయింది అంటూ సోషల్ మీడియా కోడై కూసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి డిజాస్టర్ ఇచ్చిన మారుతి అంటే ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

శ్రీరామనవమికి కొత్త స్క్రిప్ట్ రెడీ అంటూ మారుతి తనే స్వయంగా అప్ డేట్ ఇచ్చారు. ఆతర్వాత మారుతి తదుపరి హీరోపై పెద్ద చర్చే జరిగింది. తాజాగా మారుతి కి మెగా హీరో దొరికేసాడనే న్యూస్ వినిపిస్తుంది. ఆ హీరో ఎవరో కాదు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ వరస సినిమాలు చేస్తున్నాడు.

ఆయన నటించిన కొరియన్ కనకరాజ్ విడుదలకు సిద్ధమవుతుండగా.. చెల్లెలు నిహారిక ప్రొడక్షన్ లో బారి మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు మారుతి వరుణ్ తేజ్ కి కథ చెప్పి ఒప్పించాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఈమూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

Maruthi's Next With Varun Tej?