ఇక బాలయ్యే బ్యాలెన్స్ !
NBK111 Eyeing December Release
నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న NBK 111 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. మొదట్లో ఈచిత్రాన్ని దసరా కి రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే ప్రచారం జరిగినా.. ఆతర్వాత డిసెంబర్ అంటూ మరో కొత్త న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.
అదే డిసెంబర్ అంటూ ప్రచారం జరిగిన ప్రభాస్ ఫౌజీ చిత్రం రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ వచ్చేసింది. డిసెంబర్ 3 న ప్రభాస్-హను రాఘవపూడి ల ఫౌజీ విడుదల అంటూ మేకర్స్ పవర్ ఫుల్ పోస్టర్ తో ప్రకటించగానే ఇంకా బాలయ్యే బ్యాలెన్స్, NBK 111 డేట్ ని అనౌన్స్ చెయ్యడానికి అంటూ నందమూరి అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
బాలయ్య-గోపీచంద్ లు కూడా NBK 111 ప్రాజెక్ట్ న డిసెంబర్ లో ఈ తేదికి విడుదల చేస్తామంటూ డేట్ లాక్ చేసి ప్రకటిస్తే బావుంటుంది అనేది అభిమానుల కోరిక. అయితే డిసెంబర్ 25 క్రిష్టమస్ కి NBK 111 రిలీజ్ ఉండొచ్చనే న్యూస్ మొదలైంది. మరి ప్రభాస్ చెప్పేసారు, బాలయ్య ఎప్పుడు చెబుతారో ఆ గుడ్ న్యూస్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్.







































